తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత వేగంగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయగా ఆయనతో పాటు మరో 11 మంది కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఇక తొలి సంతకం ఆరు గ్యారెంటీ హామీలపై పెట్టిన రేవంత్ రెడ్డి.. వాటి అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఎన్నికల్లో 63 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకోగా బిఆర్‌ఎస్ పార్టీ 39 సీట్లను సొంతం చేసుకుంది. అయితే అధికారం కాంగ్రెస్ చేతిలో ఉండడంతో బిఆర్‌ఎస్ ఎమ్మేల్యేలు గెలిచిన నియోజక వర్గాలకు నిధుల విడుదల జరుగుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. .
ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ భిన్న ప్రభుత్వాలు ఉండడంతో బిఆర్‌ఎస్ గెలిచిన నియోజక వర్గాల్లో అభివృద్ది పనులు ఎంత మేర జరుగుతాయనే సందేహాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం కాంగ్రెస్ గెలిచిన నియోజక వర్గాలపై ప్రేమ చూపుతూ ఇతర స్థానాల్లో పక్షపాత ధోరణి అవలంభిస్తే.. కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్య్హతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. మరి గతంలో కేసిఆర్ ఎలాంటి పక్షపాతం లేకుండా రాష్ట్రంలో పాలన సాగించారు. కాంగ్రెస్ బీజేపీ గెలిచిన నియోజకవర్గాల్లో కూడా అభివృద్ది జరిగించారు. ఆ విధంగా రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రమంతటా ఏకీకృత పాలన సాగిస్తే మంచిదని లేదంటే తీవ్రమైన ప్రజాగ్రహానికి లోనూకావాల్సిందేనని రాజకీయ వాదులు హెచ్చరిస్తున్నారు.
Also Read:వాటిలో మాత్రమే ఉచితం..అన్నిట్లో కాదండోయ్!