ఉరుకుల పరుగుల జీవితం, దానికి తోడు ఒత్తిడి, మానసిక ఆందోళన వెరసీ జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. దీనికి ప్రధాన కారణం సమతూల్యమైన ఆహారం తీసుకోకపోవడమే. ఈ నేపథ్యంలో జాతీయ పోషకాహార సంస్థ ఇటీవలె ఓ నివేదికను విడుదల చేసింది.
ప్రతిరోజు ఒక వ్యక్తి సుమారు 8 గ్లాసులు (సుమారు రెండు లీటర్లు) నీళ్లు తాగాలి. కాఫీ, టీలు మితంగా తీసుకోవాలి. అలాగే భోజనానికి గంట ముందు, గంట తరువాత టీ, కాఫీలు తాగకూడదు. గ్రీన్, బ్లాక్ టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. స్నాక్స్.. పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్‌ఫుడ్ అధికంగా తీసుకోకూడదు. శీతల పానియాలు, కూల్‌డ్రింక్స్ తక్కువగా తీసుకుంటే మంచిది.
రోజు తీసుకునే ఆహారంలో 8 రకాల ఆహార పదార్థాలు ఖచ్చితంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇతరాలు కలిపి 500 గ్రాముల వరకు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారంలో తృణధాన్యాలు, పప్పులు, నాన్‌వెజ్, గుడ్లు, నట్స్, పాలు, పెరుగు ఉండేలా చూసుకోవాలి.
మూడు పూటలా మనం తీసుకునే ఆహారంలో 250 గ్రాముల తృణధాన్యాలు, 400 గ్రాముల కూరగాయలు,100 గ్రాముల పండ్లు,85 గ్రాముల పప్పులు లేదా మాంసం లేదా కోడిగుడ్డు,35 గ్రాముల పప్పుగింజలు,27 గ్రాముల కొవ్వు పదార్థాలు లేదా నూనె ఉండేలా చూసుకోవాలి. అయితే వీటిని పాటించే ముందు కచ్చితంగా డాక్టర్ల సలహాలు తీసుకోవాలి.
Also Read:15న ధనుష్ ‘కుబేర’