ఐసీసీ ప్రపంచకప్ లో భాగంగా ఆస్ట్రేలియా, భారత జట్ల మధ్య నేడు మ్యాచ్ జరుగనుంది. ఈసందర్భంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది టీం ఇండియా. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన టీమిండియా కంగారుల జోరును కట్టడి చేయాలని చూస్తోంది. మరోవైపు వరుస విజయాలతో జోరు మీదున్న ఫించ్ సేన హ్యాట్రిక్‌పై కన్నేసింది. ఇక రెండూ జట్లూ బలాబలాల్లో సమానంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఇక్కడ ఆడిన మూడింటిలో రెండు మ్యాచ్‌ల్లోనూ స్కోర్లు 300 దాటాయి. తొలుత బ్యాటింగ్ చేసి 300కి పైగా స్కోరు ఆసీస్‌కు నిర్దేశించాలని కోహ్లీసేన బ్యాటింగ్ వైపు మొగ్గుచూపింది.
భారత జట్టు: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), లోకేశ్ రాహుల్, ధోనీ(వికెట్ కీపర్), కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, బుమ్రా
ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, అరోన్‌ఫించ్(కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, స్టీవ స్మిత్, మాక్స్‌వెల్, మార్కస్ స్టాయినీస్, అలెక్స్ కేరీ(వికెట్ కీపర్), కౌల్టర్ నైల్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జంపా