రాయుడు బౌలింగ్‌పై నిషేధం…

247
ambati rayudu
- Advertisement -

భారత క్రికెటర్ అంబటి రాయుడుకు షాకిచ్చింది ఐసీసీ. అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయకుండా రాయుడిపై నిషేధం విధించింది. ఆసీస్‌తో మ్యాచ్‌ సందర్భంగా అనుమానస్పదంగా బౌలింగ్ చేసినందుకు రాయుడు బౌలింగ్‌పై వేటువేసింది.

అనుమానస్పదంగా బౌలింగ్ చేసినందుకు రాయుడు తన బౌలింగ్ యాక్షన్ నిరూపించుకోవాలని ఐసీసీ 14 రోజుల గడువు కూడా ఇచ్చింది. నిర్దిష్ట కాల వ్యవధిలో రాయుడు బౌలింగ్ శైలిని నిరూపించుకోకపోవడంతో ఐసీసీ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఐసీసీ నిబంధనల్లో 4.2 క్లాజ్ ప్రకారం సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని కౌన్సిల్ తెలిపింది.

49 వన్డేల్లో ఇప్పటి వరకూ 121 బంతులు మాత్రమే వేసిన రాయుడు మూడు వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 9సార్లు మాత్రమే బౌలింగ్ చేసిన రాయుడు అంతర్జాతీయ టీ20ల్లో ఒక్కసారి కూడా బౌలింగ్‌కు దిగలేదు.

- Advertisement -