- Advertisement -
ఐసీసీ బోర్డు మీటింగ్‌లో సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్‌ను వాయిదా వేశారు. కరోనాతో ఈ ఏడాది ప్రపంచ కప్ హోస్టింగ్ హక్కులు ఉన్న ఆస్ట్రేలియా ప్రస్తుతం కరోనా పరిస్థితుల కారణంగా ఈ టోర్నీని నిర్వహించలేమని ప్రకటించడంతో రెండు నెలల తర్వాత టోర్నిని వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది ఐసీసీ. దీంతో ఐపీఎల్‌కు లైన్ క్లీయర్ అయింది.
ఐసీసీ చీఫ్ పదవి నుండి శశాంక్ మనోహర్ తప్పుకున్న 20 రోజుల వ్యవధిలోనే ఈ రోజు జరిగిన మొదటి ఐసీసీ వర్చువల్ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకుంది ఐసీసీ.
దీంతో ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ శరవేగంగా పావులు కదపనుంది. ఇప్పటికే యూఏఈలో ఐపీఎల్ జరగనున్నట్లు సంకేతాలు వెలువడుతుండగా త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
- Advertisement -