ఆసియా కప్ 2025లో భాగంగా మ్యాచ్ రిఫరీ ఆండి పైక్రాఫ్ట్‌ను ప్యానెల్ నుండి తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చేసిన డిమాండ్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మంగళవారం తిరస్కరించింది.
ఆదివారం భారత్‌తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో టాస్ సమయంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో చేతులు కలపవద్దని పైక్రాఫ్ట్ చెప్పారని పీసీబీ ఆరోపిస్తూ, అధికారికంగా ఫిర్యాదు చేసింది.
అయితే ఈ వివాదంపై ICC నుంచి పీసీబీకి సమాధానం వచ్చింది. పైక్రాఫ్ట్‌ను తొలగించబోమని, వారి విన్నపాన్ని తిరస్కరించామని స్పష్టంచేసింది ICC.69 ఏళ్ల జింబాబ్వేకు చెందిన పైక్రాఫ్ట్ బుధవారం జరిగే పాకిస్తాన్–యూఏఈ తుదిగ్రూప్ మ్యాచ్‌కు కూడా అధికారిగా వ్యవహరించనున్నారు.
పాకిస్తాన్ జట్టు మేనేజర్ నవేద్ చీమా కూడా ఆసియన్ క్రికెట్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. ఆదివారం మ్యాచ్‌లో రెండు జట్ల కెప్టెన్లు జట్టు జాబితాలను పరస్పరం మార్చుకోకపోవడానికి కారణం పైక్రాఫ్ట్ సూచనే అని ఆయన ఆరోపించారు.
Also Read:అమెరికాలో మళ్లీ టిక్‌టాక్..!

