24 నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

7
- Advertisement -

టీటీడీ పాలకమండలి సమావేశం ప్రారంభం అయింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశం జరుగగా బ్రహ్మోత్సవాల బుక్‍లెట్స్ ను ఆవిష్కరించారు టీటీడీ ఛైర్మన్.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 24న శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు.

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 24 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేసింది టీటీడీ సిబ్బంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ అనిల్ సింఘాల్, టీటీడీ బోర్డు సభ్యులు తెలిపారు.

Also Read:‘ఇడ్లీ కొట్టు’ ..ఫీల్ గుడ్ సాంగ్!

- Advertisement -