స్వచ్ఛత అంటే శుభ్రతే కాదు!

10
- Advertisement -

స్వచ్ఛత అంటే శుభ్రతే కాదు అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రెండోరోజు కలెక్టర్ల సదస్సులో భాగంగా స్వచ్ఛాంధ్ర, ఐటీ, ఆదాయార్జన శాఖ, లా అండ్ ఆర్డర్ పై సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. ఈ సమావేశంలో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు… మొదటిసారి సింగపూర్ వెళ్లి అక్కడ పరిస్థితిని అధ్యయనం చేశా..హైదరాబాద్ లో నైట్ క్లీనింగ్ ప్రారంభించాం అని తెలిపారు. పొరుగుసేవల సిబ్బందిని నియమించడం కూడా అదే తొలిసారి పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమం తీసుకొచ్చాం అని వెల్లడించారు.

ప్రధాని నాకు అవకాశమిస్తే స్వచ్ఛభారత్ రిపోర్టు కూడా ఇచ్చాం.. స్వచ్ఛత అంటే శుభ్రతే కాదు.. అన్ని కోణాల్లో చూడాలి అన్నారు. ఒకప్పుడు ఆనంద ఆదివారం కూడా పెట్టాం.. ఎవరికి ఏ ప్రతిభ ఉంటే దాన్ని బయటపెట్టేవాళ్లు.. ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం కొన్ని కార్యక్రమాలు వచ్చాయి.. లాఫింగ్ సొసైటీ, షౌటింగ్ సొసైటీలు వస్తున్నాయి అన్నారు.

Also Read:‘ఇడ్లీ కొట్టు’ ..ఫీల్ గుడ్ సాంగ్!

- Advertisement -