క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే క్రికెట్ మహాసంగ్రామం వరల్డ్ కప్ షెడ్యూల్‌ని విడుదల చేసింది ఐసీసీ. మే 30 నుంచి జూలై 14 వరకు మహాసంగ్రామం జరగనుందని ఐసీసీ తెలిపింది. భారత్ తొలి మ్యాచ్ జూన్ 5న దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనుండగా జూన్ 16న దాయాది పాకిస్థాన్ జట్టును ఢికొట్టనుంది.
జూన్ 9న ఆస్ట్రేలియాతో,13న న్యూజిలాండ్‌తో,22న అఫ్ఘానిస్తాన్‌తో భారత్ తలపడనుంది. క్రికెట్ మక్కా లార్డ్స్‌లో జూలై 14న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొత్తం 48 మ్యాచ్‌లు జరగనుండగా దాయాదుల పోరుపైనే సర్వత్రా ఆసక్తినెలకొంది.+
గత వరల్డ్ కప్‌లకు భిన్నంగా ఈ సారి ఐసీసీ షెడ్యూల్‌ని ప్రకటించింది. గతంలో ఇండియా, పాకిస్థాన్ తోనే పెద్ద పెద్ద ఈవెంట్ లను ఐసీసీ ప్రారంభించేది. 2015 వరల్డ్ కప్, 2017 చాంపియన్స్ ట్రోఫీ ఇలాగే ప్రారంభమైంది. అయితే ఈసారి మాత్రం ఇండిచా-పాక్ మ్యాచ్‌తో వరల్డ్ కప్ ప్రారంభం కావడం లేదు.