తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగియడంతో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈసందర్భంగా టీఆర్ఎస్ పార్టీ గెలుపుకోసం అహర్నిశలు కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలు రాబోయే 48గంటలు అప్రమత్తంగా ఉండాలని ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరు తన ఓటు హక్కును వినియోగించుకునేలా నియోజకవర్గ పరిధిలోని బూత్ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఓటింగ్ శాతం ఎంత పెరుగుతే టీఆర్ఎస్ అభ్యర్ధుల మెజార్టీ కూడా పెరుగుతుందన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉదయం పూటనే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చేలా కృషి చేయాలన్నారు. ప్రతి పోలింగ్ బూత్‌లో టీఆర్‌ఎస్ పోలింగ్ ఏజెంట్లను నియమించాలని, అవసరమైన అనుమతి పత్రాలు, ధ్రువపత్రాలు సమర్పించాలని నాయకులకు సూచించారు. ప్రత్యర్ధి పార్టీల నేతలు ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు.