- Advertisement -
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఎల్బీ స్టేడియంలో జరుగగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరు అయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. విజయశాంతితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఇద్దరం కలిసి 18 సినిమాల్లో నటించామని మద్రాసులో కూడా ఎదురెదురు ఇళ్లలో ఉండే వాళ్లమని చెప్పారు. విజయశాంతి తనకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అని కానీ రాజకీయాలు మమ్మల్ని దూరం చేశాయని చెప్పారు. పాలిటిక్స్ వల్ల తమ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందన్నారు.
తర్వాత మాట్లాడిన విజయశాంతి…చిరుతో నటించాలనుంది అనగానే తాను కూడా సిద్ధమే అన్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారింది. చిరు-విజయశాంతి మాటలను షేర్ చేస్తూ నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు.
- Advertisement -