ఏపీకి ముఖ్యమంత్రి అవుతా: పవన్

148
- Advertisement -

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన దూకుడుగా వ్యవహరిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి రావాలని దృఢ నిశ్చయంతో ఉన్న పవన్ వెస్తోన్న ప్రతి అడుగు కూడా పోలిటికల్ హిట్ పెంచుతోంది. ఇక గతంతో పోలిస్తే ప్రస్తుతం జనసేన చాప కింద నీరులా ఏపీలో బలపడుతోంది. పవన్ చేపట్టిన రైతు భరోసా యాత్ర, కౌలు రైతులకు ఆర్థిక సాయం, జనవాణి వంటి కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందననే వచ్చింది. దాంతో జనసేనాని మరింత దూకుడుగా ప్రజల్లో ముందుకు సాగుతున్నారు..

దాంతో జనసేన దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అధికార వైసీపీ గట్టి ప్రయత్నలే చేస్తోంది. దాంతో జనసేన వర్సస్ వైసీపీ మద్య జరుగుతోన్న రాజకీయ రగడ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. వైసీపీ నేతలు తరచూ పవన్ టార్గెట్ గా విమర్శలు చేయడం. పవన్ కూడా తనదైన రీతిలో కౌంటర్లు వేస్తుండడంతో..పోలిటికల్ హిట్ మరింత పెరుగుతోంది. ఇక త్వరలోనే యుద్దం మొదలు పెడతా అంటూ పవన్ తన ప్రచార రథం వారాహిని సిద్దం చేసుకోగా.. దానిపై కూడా వైసీపీ నేతలు విమర్శలు గట్టిగానే సంధించారు. ఇలా జనసేన వైసీపీ మద్య హాట్ హాట్ గా సాగుతున్న రాజకీయం తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలతో మరింత హిట్ ను పెంచుతోంది.

తాజాగా సత్తెనపల్లి లో పర్యటించిన పవన్.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా కోరుకుంటే తాను ఏపీకి సి‌ఎం అవుతానని, ఏ పార్టీకి కొమ్ముకాయను అంటూ పవన్ చెప్పుకొచ్చారు. ఏపీ లో జనసేన అధికారంలోకి వస్తే రాష్ట్రనికి కేటాయించే లక్షల కోట్ల రూపాయలలో ప్రతి రూపాయి ఎలా ఖర్చు అయిందో ప్రజలకు శ్వేతపత్రం ద్వారా తెలియజేస్తానని అన్నారు. బడ్జెట్ లెక్కలలో తేడా వస్తే తానను నిరభ్యంతరంగా నిలదీయవచ్చని,అందులో సంకోచం ఏమి లేదని చెప్పుకొచ్చారు పవన్. ప్రజలకు అవినీతిరహిత, పరదర్శీక పాలన అందించడమే తన లక్ష్యం అంటూ పవన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

- Advertisement -