డాక్టర్ల రుణం తీర్చుకోలేను: బ్రిటన్ ప్రధాని

289
boris johnson
- Advertisement -

తన ప్రాణాలు కాపాడిన డాక్టర్ల రుణం తీర్చుకోలేనిదని తెలిపారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. కరోనా బారిన పడి ఐసీయూలో చికిత్స పొందిన ఆయన కోలుకున్న అనంతరం సాధారణ వార్డుకు తరలించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కరోనా వైరస్ బారినపడ్డ తనకు ఆసుపత్రిలో చికిత్స అందజేసి, ప్రాణాలు కాపాడిన వైద్య సిబ్బందికి తాను జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. సెయింట్‌ థామస్‌ ఆసుపత్రి సిబ్బందికి కేవలం థ్యాంక్స్ చెప్పడంతోనే తన రుణం తీరిపోదన్నారు.

ఈస్టర్ రోజున ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, వాతావరణం చల్లగా ఉండటంతో వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువగా ఉంటుందని పలువురు మంత్రులు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ ఏడాది చర్చిలు మూసివేసినందున అందరూ కుటుంబంతో కలిసి ఇంట్లోనే పండగ చేసుకోవాలని సూచించారు.

- Advertisement -