ప్రభాస్ రాముడిగా ఒప్పించడానికి తాను చాలా కష్టపడ్డట్టు ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఓం రౌత్ రాముడి పాత్రలో ప్రభాస్‌ను ఎంపిక చేసుకోవడానికి గల కారణాన్ని వివరించారు. ఆ పాత్ర కోసం ప్రభాస్‌ను ఒప్పించడానికి చాలా కష్టపడినట్లు తెలిపారు. సినిమా చేయాలని అనుకున్నప్పటి నుంచి ప్రభాస్‌ను మాత్రమే రాముడిగా ఊహించుకున్నట్టు చెప్పారు.
మొత్తం రామాయణాన్ని తెరపై చూపించడం సాధ్యం కాదు. ఆదిపురుష్ కొత్త తరం కోసం తీసిన సినిమా. అందుకే ఇందులోయద్ధకాండను మాత్రమే ఎంచుకున్నాను. నాకు వ్యక్తిగతంగానూ ఈ భాగం చాలా ఇష్టం. ఇందులో రాముడు పరాక్రమవంతుడిగా కనిపిస్తాడు. ప్రభాస్ ఖచ్చితంగా సరిపోతాడని అనుకొని ఆప్రోచ్ అయినట్టు చెప్పారు. మన హృదయంలోని భావాలు కళ్లలో కనిపిస్తాయని నా అభిప్రాయం. ప్రభాస్ కళ్లలో నీతి, నిజాయితీ కనిపిస్తుంటాయి. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా వినయంగా ఉంటారు. అందుకే సినిమా చేయాలని అనుకున్న రోజే రాముడిగా ప్రభాస్ మాత్రమే సరైన ఎంపిక అని భావించాను.
Also Read: మా నాన్న సూపర్ హీరో..అద్భుత స్పందన
ప్రభాస్‌కు మొదట ఈ విషయం చెప్పగానే తను ఆశ్చర్యపోయారు. ఫోన్లో పాత్రకు సంబంధించిన వివరాలు చెప్పడానికి చాలా కష్టపడ్డాను. ఒకసారి తనని కలిసి స్టోరీ గురించి చెప్పగానే ప్రభాస్ ఓకే అన్నారు. కానీ అతడిని ఒప్పించడం అంత తేలికగా జరగలేదని వివరించారు. నాకు అన్ని విధాలుగా సపోర్టుగా నిలిచారు. భవిష్యత్‌లోనూ మా స్నేహం ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాను అని ఓం రౌత్ చెప్పుకొచ్చారు.
Also Read: 29న నిఖిల్… ‘స్పై’