తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్ లో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది ‘అర్జున్ రెడ్డి’ మూవీ. సందీప్ వంగర డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ మూవీని వివాదాలు కూడా వెంటాడుతున్నాయి. సినిమాలో అశ్లీల సన్నివేశాలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, ‘అర్జున్ రెడ్డి’ తనకి ఒక విజయాన్ని ఇవ్వడమే కాదు .. ఒక పాఠాన్ని కూడా నేర్పిందని చెప్పాడు. తాను ఎలా ఉండాలనుకుంటున్నానో అలాగే ఉండాలనీ, మొహమాటాలకు పోకూడదని నిర్ణయించుకున్నానని అన్నాడు.
కథ నచ్చకపోతే నచ్చలేదని చెబుతాననీ, డేట్స్ లేవనీ .. సర్దుబాటు కావడం లేదని సాకులు చెప్పనని విజయ్ దేవరకొండ స్పష్టం చేశాడు. రియలిస్టిక్ గా ఉండే పాత్రలే తనకి సరిపడతాయనీ, తన నుంచి అలాంటి పాత్రలనే ఆడియన్స్ ఆశిస్తున్నారని చెప్పాడు.
తాను పోషించిన పాత్రలో ప్రతి ఒక్కరూ తమని చూసుకోగలిగినప్పుడే ఆ పాత్ర కనెక్ట్ అయినట్టు అవుతుందనీ, ‘అర్జున్ రెడ్డి’ విషయంలో అదే జరిగిందని అన్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో నాలుగు సినిమాలు వున్నాయి.