చిరుని వదలను -పూరీ

161
Puri Jagannadh About Movie With Chiranjeevi
- Advertisement -

పూరీ జగన్నాథ్‌ హిట్లలో ఉన్నా..ఫ్లాప్‌ల్లో ఉన్నా..ఆ పేరుకు ఉన్న క్రేజ్ మాత్రం ఇప్పటికీ మారలేదు. హీరోతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్స్ కొట్టగల దమ్మునోడు. స్టార్ హీరో అయినా..యంగ్ హీరోలతో అయినా మూడు నెలల్లో సినిమా పూర్తీ చేయడం ఈ డాషింగ్ డైరెక్టర్ మరో స్పషాలిటీ. హీరో కనిపించే ప్రతి సీన్లలో పూరి మార్క్‌ ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే గతంలో చిరుతో సినిమా తీయలని తెగ ప్రయత్నాలు చేసినా కారణం తెలిదు కాని ఈ కాంబినేషన్‌ కుదర్లేదు. చిరంజీవిని వదిలేదు లేదు .. ఈసారి ఆయనతో సినిమా చేసి తీరుతానని తాజా ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ చెప్పాడు.

Puri Jagannadh About Movie With Chiranjeevi

‘చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను .. ఒక వీరాభిమానిగా ఆయన సినిమాలు ఎలా ఉండాలో తెలుసు .. ఒక దర్శకుడిగా ఆయనను ఎలా చూపించాలనే విషయంలో నాకు ఒక స్పష్టమైన విజన్ వుంది. అలాంటప్పుడు ఆయన స్థాయికి తక్కువగా అనిపించే సినిమాను ఎందుకు చేస్తాను?’ అంటూ పూరి అన్నాడు.

‘ఆటో జానీ’ కథ చిరూకి బాగా నచ్చిందనీ, అయితే ఆయన ఆ సినిమా చేయకుండా కొంతమంది ప్రభావితం చేశారని చెప్పాడు. 3 నెలల క్రితం చిరంజీవికి మరో కథ వినిపించాననీ, ఈ కథ కూడా ఆయనకి బాగా నచ్చిందని అన్నాడు. గతంలో మాదిరిగా ఈసారి జరగనీయననీ, ఈ కథతో ఆయనతో తప్పకుండా సినిమా చేస్తానని చెప్పాడు. ప్రస్తుతం చిరూ ‘సైరా నరసింహా రెడ్డి’ చేస్తున్నారు. ఆ తరువాత బోయపాటి దర్శకత్వంలో ఆయన సినిమా ఉంటుంది. ఈ ప్రాజెక్టు తరువాత పూరి ప్రాజెక్టు విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం వుంది.

- Advertisement -