బ్యాడ్మింటన్‌ స్టార్‌తో బాలీవుడ్‌ స్టార్‌..

236
PV Sindhu was beaten By Sonu Sood in Badminton
- Advertisement -

ఇప్పుడు మన దేశం సినిమాలో క్రీడలు పైకూడా కథలు రాసి సినిమాలుగా తెరకెక్కిస్తున్నారు. అమీర్ ఖాన్- దంగల్ వెంకటేష్ – గురు కమర్షియల్ సినిమాలైతే.. బాగ్ మిల్కా బాగ్.. మేరి కోమ్ సినిమాలు ఒరిజిన్ స్పోర్ట్స్ బయోపిక్స్. అయితే ఇప్పుడు బ్యాడ్మింటన్ యువ సంచలనం తెలుగు తేజం సింధు జీవితం పై కూడా ఒక సినిమా రాబోతుంది. ఈ సినిమాను హింది, తెలుగు నటుడైన సోనూ సూద్ నిర్మిస్తున్నారు. సినిమాకు సంభందించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. షూటింగ్ కూడా హైదరాబాద్ రియల్ లొకేషన్లో షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

PV Sindhu was beaten By Sonu Sood in Badminton

తాజాగా నటుడు సోనూసూద్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ పి.వి సింధుతో సరదాగా బ్యాడ్మింటన్‌ ఆడారు. సింధు జీవితాధారంగా సోనూసూద్‌ బయోపిక్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరూ ఓ అకాడమీలో ఇలా బ్యాడ్మింటన్‌ ఆడారు. ఈ వీడియోని సోనూ ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘మన ప్రత్యర్థి ప్రపంచంలోనే బెస్ట్‌ అయినప్పుడు ఓటమి గురించి భయమక్కర్లేదు. మమ్మల్ని గర్వపడేలా చేసినందుకు ధన్యవాదాలు సింధు’ అని ట్వీట్‌ చేశారు. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో సింధు రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. బయోపిక్‌లో నటించేవారి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని సోనూ తెలిపారు.

- Advertisement -