బెంగాల్ ఎన్నికల సంగ్రామం తారాస్ధాయికి చేరింది. ముఖ్యంగా నందిగ్రామ్‌లో మమతా వర్సెస్ సువేందు అధికారి మధ్య హోరాహోరిగా పోరు సాగుతుండగా కేంద్రబలగాల పహార మధ్య ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఇక ముఖ్‌యంగా హిందుత్వ ఎజెండాతో బీజేపీ జనంలోకి దూకుడుగా వెళ్తుండగా… టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా తానూ హిందువునే అని పదేపదే చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తన గోత్రాన్ని చెప్పారు మమతా. నా అసలు గోత్రం “శాండిల్య(బ్రాహ్మాణుల 8పెద్ద గోత్రాలలో ఒకటి)” అని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీపై నిప్పులు చెరిగారు మమతా.
రెండో దశలో భాగంగా ఏప్రిల్-1,2021న బెంగాల్లో 30అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.రెండో దశలో భాగంగా బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాలు, బంకురా, పూర్వ మెద్నీపూర్ జిల్లాల్లోని నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.