పీక్ విద్యుత్ డిమాండ్‌ను అధిగమించాం: ప్రభాకర్ రావు

116
cmd prabhakar rao
- Advertisement -

13688 మెగా వాట్స్ పిక్ డిమాండ్‌ను విద్యుత్ సంస్థలు అధిగమించాయన్నారు సీఎండీ ప్రభాకర్ రావు. ఇదే తెలంగాణ రాష్ట్రం లో అత్యధిక డిమాండ్ అయిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేశాం అన్నారు. గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో 13 168 మెగా వాట్స్ డిమాండ్ వచ్చింది కానీ ఈ సంవత్సరం అంతకంటే డిమాండ్ పెరిగిందన్నారు.

ఏ రాష్ట్రంలో లేనివిధంగా 5000 మెగా వాట్స్ వ్యవసాయ రంగం కు విద్యుత్ సరఫరా చేస్తున్నాం అన్నారు. ఇంత డిమాండ్ వచ్చిన అన్ని రకాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం అన్నారు.

సీఎం కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి ముందు చూపు తో విద్యుత్ ఉద్యోగుల పని తనం తో ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నాం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో ఇంతటి విద్యుత్ డిమాండ్ ఉన్న వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం….దేశంలో నే అత్యధికంగా వ్యవసాయ రంగం కు విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేదు…భవిష్యత్తు లో ఇంకా డిమాండ్ పెరిగిన విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం అన్నారు.

విద్యుత్ డిమాండ్ పై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారని తెలిపారు టీఎస్ ఎస్పీడిసిఎల్ సీఎండీ రఘుమా రెడ్డి. గత సంవత్సరం తో పోల్చుకుంటే ఒక్క జిహెచ్ఎంసి లోనే 1700 మెగా వాట్స్ ఉండే ఇవాళ 2760 మెగా వాట్స్ డిమాండ్ పెరిగిందిన్నారు. 3000 మెగా వాట్స్ డిమాండ్ వచ్చే అవకాశం ఉంది దానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్నారు.

వ్యవసాయ రంగం కు ఈ సంవత్సరం చాలా విద్యుత్ వినియోగం పెరిగింది.కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణము తో వ్యవసాయ రంగం కు విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ తో వ్యవసాయ రంగం కు విద్యుత్ డిమాండ్ పెరిగిందని….అమెజాన్ డేటా సెంటర్ లకు కూడా మూడు సెంటర్ లకు కలిపి 30 మెగా వాట్స్ చొప్పున విద్యుత్ సరఫరా చేస్తున్నాం అన్నారు. ఐటీ పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం …టీఎస్ ఐపాస్ తో హైదరాబాద్ నగరంలో పరిశ్రమలు నెలకొల్పుతున్నారు దీనితో విద్యుత్ వినియోగం పెరుగుతుందన్నారు.

- Advertisement -