సెంచరీ చేయనందుకు బాధలేదు:రహానే

525
rahane
- Advertisement -

వెస్టిండీస్‌తో ఆంటిగ్వా వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అజింక్య రహానె కొద్దిలో సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మయాంక్ అగర్వాల్ (5), పుజారా (2), విరాట్ కోహ్లి (9) త్వరగా పెవిలియన్ బాట పట్టడంతో  25 పరుగులకే 3 వికెట్లు కొల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులో వచ్చిన రహానే టీమిండియా గౌరవ ప్రదమైన స్కోరు చేయడంలో  కీలక పాత్ర పోషించాడు.

ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ 81 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివరిసారిగా రెండేళ్ల క్రితం సెంచరీ చేసిన రహానె ఈ మ్యాచ్‌లో  శతకానికి దగ్గరగా వచ్చి ఔటవడంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు.

తన సెంచరీ మిస్‌పై ప్రశ్నలు వేస్తానని ముందే ఊహించానని చెప్పారు.సెంచరీ చేయలేదని బాధ లేదు. సెంచరీ కొట్టి మైలురాళ్లు సాధించాలన్న ఆతృతా లేదన్నారు.

తాను జట్టుకోసం ఆడుతున్నాను. వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండటమే ముఖ్యం. ఎప్పుడు జట్టు గురించి ఆలోచిస్తాను. తనకంత స్వార్థం లేదన్నారు. కొంతకాలంగా జట్టులో తన ప్రదర్శన చూస్తే అందరికి అర్ధమవుతుందన్నారు.

- Advertisement -