పుష్పక విమానం రిలీజ్ డేట్ ఫిక్స్..

47
pushpaka vimanam

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, గీతా శైనీ, శాన్వి మేఘన ప్రధానపాత్రల్లో నూతన దర్శకుడు దామోదర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్పక విమానం. గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మించగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ని 30న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తుండటం విశేషం. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఆంధ్రా, సీడెడ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, నైజాంలో గ్లోబల్ సినిమాస్ రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్ లో ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలింస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రతీది మంచి బజ్‌ని క్రియేట్ చేసింది.