బాహుబలి 2… కలెక్షన్స్‌..

169
- Advertisement -

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు భారతీయ సినీరంగ చరిత్రలో మరే చిత్రానికీ సాధ్యం కాని మహాద్బుతాన్ని రాజమౌళి తీసిన బాహుహలి2 సృష్టించింది. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాహుబలి ఏకంగా ఒక్క‌రోజులోనే 200 కోట్ల రూపాయ‌ల క‌లెక్ష‌న్లు వ‌చ్చాయ‌ని అంచనా. ప్రపంచవ్యాప్తంగా వేలాది స్క్రీన్లపై బాహుబలి-2 ప్రదర్శితమైంది. దేశంలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన మల్టీప్లెక్స్‌ల్లో రోజుకు 15 నుంచి 20 షోలు నడిచాయి. ప్రదర్శితమవుతున్నాయి. గత పదేళ్లలో ఏ సినిమాకీ లేని విధంగా 96 శాతం ఆక్యుపెన్సీ సాధించి బాహుబలి సత్తాచాటింది.

Hype results in Rs 100 crore

అమెరికాలో అయితే గ‌తంలో ఎప్పుడూ లేనంత‌గా ఊహ‌కంద‌ని విధంగా సినిమాకు క‌లెక్ష‌న్లు పోటెత్తుతున్నాయి. ప్రీమియ‌ర్ షోల‌తోపాటు మొద‌టి రోజు క‌లెక్షన్ల లెక్క‌లు చూసి ఎన్నారైలు ముక్కున వేలేసుకుంటున్నారు. సాధార‌ణంగా వారం రోజులు దాటినా ఒక మిలియ‌న్ డాల‌ర్ క‌లెక్ష‌న్లు దాట‌డం క‌ష్టం. కానీ బాహుబ‌లి-2 మాత్రం ఏకంగా మొద‌టి రోజుకే 45 ల‌క్ష‌ల 21 వేల‌26 డాల‌ర్లు (29.06 కోట్ల రూపాయ‌లు) కొల్ల‌గొట్టి చరిత్రను తిర‌గ‌రాస్తోంది. ఈ క‌లెక్ష‌న్ల వివ‌రాల‌ను బాలీవుడ్ సినీ విశ్లేష‌కుడు త‌రుణ్ ఆద‌ర్శ్ ట్వీట్ చేశారు

కాగా రికార్డు స్థాయి ఓపెనింగ్స్ తో ఒక్క దెబ్బ‌తో అమెరికాలో అత్య‌ధిక క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టిన సినిమాల్లో టాప్-2 స్థానానికి ఎగ‌బాకింది. టాప్ -1 ప్లేస్ లో ఉన్న బాహుబ‌లి-1 క‌లెక్ష‌న్ల‌ను దాటేడ‌యం అంత క‌ష్ట‌మేమీ కాదు. 7.51 మిలియ‌న్ డాల‌ర్లు క‌లెక్ట్ చేసిన బాహుబ‌లి-1ను.. బాహుబ‌లి-2 సుల‌భంగా దాటేస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. . ఈ వీకెండ్ లో సినీ చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్య‌య‌నం మొద‌ల‌వ‌బోతోందంటూ సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

దక్షిణాదిలో వందకోట్ల వసూళ్లు ఫుల్ రన్‌లో సాధించటమే కష్టంగా ఉన్న రోజుల్లో.. తొలి రోజే 125 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన బాహుబలి ఆల్ టైం రికార్డును సెట్ చేసింది. ఇప్పటికే బాలీవుడ్ రికార్డ్ లను బద్దలు కొట్టిన బాహుబలి ఫుల్ రన్‌లో రూ. 1000 కోట్ల గ్రాస్ వసూలు చేయటం కాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -