న్యూ ఇయర్ వేడుకలు నిషేధం..

37
tamilnadu

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ని గ్రాండ్‌గా జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారా..?అయితే ఇది చేదువార్తే. ఎందుకంటే పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతు కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్‌కమ్ యూత్ అంతా నెల రోజుల ముందు నుండే ప్లాన్ చేసుకుంటారు. స్నేహితులతో కలిసి పబ్‌లు,రెస్టారెంట్లు,రిసార్ట్‌లు ఇలా తమకు నచ్చిన ప్రదేశాలను ఎంచుకుని ఫుల్ జోష్‌లో మునిగి తేలుతారు. అయితే అలాంటి వారికి ఇది స్యాడ్ న్యూసే.

ఎందుకంటే క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో నూత‌న సంవ‌త్స‌రం వేడుక‌ల‌పై త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం నిషేధం విధించింది. బీచ్‌ల‌తో పాటు బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఎలాంటి పార్టీల‌కు అనుమ‌తి ఇవ్వ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది.

డిసెంబ‌ర్ 31 నుంచి జ‌న‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు బీచ్‌ల వ‌ద్ద జ‌నాలు సెలబ్రేష‌న్స్ చేసుకోవ‌ద్దు అని ఉత్త‌ర్వులు జారీ చేసింది ప్ర‌భుత్వం. ప్ర‌జ‌లు ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించి క‌రోనా వైర‌స్ నిరోధానికి కృషి చేయాల‌ని ప్ర‌భుత్వం కోరింది.బీచ్ రెస్టారెంట్లు, రిసార్ట్స్, హోట‌ల్స్, క్ల‌బ్స్‌పై నిఘా పెట్టామ‌ని, న్యూ ఇయ‌ర్ వేడుక‌లు నిర్వ‌హిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది.