గుడ్ న్యూస్.. కరోనాకు త్వరలోనే మెడిసిన్

455
corona
- Advertisement -

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా భయాందోళనకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 13వేల మంది మరణించిగా…3లక్షల మందికి ఈ వ్యాధి సోకింది. ఇండియాలో మాత్రం 310 మందికి కరోనా రాగా 6గురు మృతి చెందారు. కరోనా ను తరిమికొట్టేందుకు ఇవాళ ఇండియాలో జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. అందరూ ఇళ్లలోనే ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అయితే ఇప్పటి వరకు కరోనా కు మందుకు ఎవరు కనిపెట్టలేదు.

కరోనాకు త్వరలోనే మెడిసిన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. హైడ్రాక్సీక్లోరోక్వినైన్, అజిత్రోమైసిన్ కలయికతో కరోనాకు మెడిసిన్ తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ట్రయల్స్ చివరి దశకు చేరుకున్నాయని ట్వీట్ చేశారు ట్రంప్. ఈ మెడిసిన్ తో కరోనాకు చెక్ పెట్టవచ్చని అంటున్నారు ట్రంప్. ఈ ప్రయోగం విజయవంతం అయితే వైద్య చరిత్రలో అద్భతం ఆవిష్క్రతమవుతుందన్నారు. ట్రంప్ చేసిన ట్వీట్ పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా కరోనా వ్యాధి వల్ల ఇటలీలో ఎక్కువగా 4,825మంది మరణించారు.

- Advertisement -