చప్పట్లతో ఐక్యతను చాటుకుందాంః నాగార్జున

474
nagarjuna

కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ లో పాల్గొంటున్నారు ప్రజలు. దేశ వ్యాప్తంగా రవాణా స్ధంబించిపోయింది. దీంతో రోడ్లన్ని ఖాళీగా ఉన్నాయి. అత్యవసర సేవలు తప్ప మిగతా అన్ని వ్యాపారాలు మూసేసారు. స్వఛ్చందంగా స్వీయ నిర్భందం పాటిస్తున్నారు ప్రజలు.

ఉద‌యం 7గం.ల నుండి ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి రావ‌డ‌మే మానేశారు. రాత్రి 9గం.ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ పాటించనున్నారు. అలాగే సాయంత్రం 5గం.ల‌కి మ‌న‌ల్ని కంటికి రెప్ప‌లా కాపాడుతున్న వైద్యులు, పారిశుద్ధ కార్మికులు,పోలీస్ శాఖ వారికి సంఘీభావంగా ఇంటి ముందుకు వచ్చి కరతాళధ్వనులతో ధన్యవాదాలు తెలియజేద్దామ‌ని ప్రధాని మోదీ పిలపునిచ్చారు. తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా జనతా కర్ఫ్యూ పై స్పందించారు. భారతీయులందరం ఐక్యంగా నిలబడి ఈ ప్రతికూల పరిస్థితుల్ని అధిగమిద్ధాం అని అన్నారు. ప్రభుత్వం చెప్పిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు.