- Advertisement -
హైదరాబాద్ హఫీజ్ పేటలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. 17 ఎకరాల్లోని అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది హైడ్రా. మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు చెందిన కార్యాలయం కూల్చివేశారు.
రూ.2 వేల కోట్ల విలువైన భూ ఆక్రమణలను అడ్డుకుంది హైడ్రా. 2005లో ఈ భూమిని కొనుగోలు చేశామని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు.
ఈ ల్యాండ్ పై ఎలాంటి అభ్యంతరాలు లేవని రంగారెడ్డి కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు వెల్లడించారు. స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిసి భూమికి సంబంధించిన పత్రాలు సమర్పించామని వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. కానీ హైడ్రా అధికారులు తమ ఆఫీసు మొత్తాన్ని కూల్చేశారని తెలిపారు టీడీపీ ఎమ్మెల్యే.
Also Read:వీడియో..మైనర్ విద్యార్థులతో టీచర్ మద్యం!
- Advertisement -

