HMRL:హైదరాబాద్ వాసులకు శుభవార్త..!

84
- Advertisement -

హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ లిమిటెడ్‌ సంస్థ రేపటి నుంచి ఏప్రిల్‌4 నుంచి రాయ్‌దుర్గ్‌ మెట్రో స్టేషన్‌లో ఆర్మ్‌ బీ నాల్గవ ద్వారం తెరువనున్నారు. మెట్రో ప్రయాణీకులు మరింత సౌకర్యవంతంగా మరీ ముఖ్యంగా రద్ధీ వేళల్లో స్టేషన్‌లోకి వేళ్లేందుకు ఈ నాల్గవ ద్వారం తెరవనున్నారు. మెట్రోరైల్‌ అత్యంత రద్ధీగా ఉండే స్టేషన్‌లలో రాయ్‌దుర్గ్‌ ఒకటి. అందుకోసం ఈ విభాగంను తెరవడం ద్వారా ప్రయాణికులకు మరింత సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలవుతుందన్నారు. ఈ నూతన ద్వారానికి మెట్ల మార్గంతో పాటుగా ఎస్కలేటర్‌ కూడా ప్రయాణికుల సౌలభ్యం కోరకు రేపటి నుంచి వినియోగంలోకి తీసుకురానున్నారు.

ఈ సందర్భంగా ఎన్‌వీఎస్ రెడ్డి మాట్లాడుతూ…రాయ్‌దుర్గ్‌ మెట్రో స్టేషన్‌ నాల్గవ ద్వారాన్ని ప్రజలకు అంకితం చేస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నామని అన్నారు. దీనితో ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతంగా స్టేషన్‌లోకి వెళ్లడంతో పాటుగా మరింత మెరుగైన సేవలను పొందగలరని అన్నారు.

సీఈవో కేవీబీ రెడ్డి మాట్లాడుతూ…మెట్రో ప్రయాణీకుల సౌకర్యం భద్రతకు మేము నిరంతరం కట్టుబడి ఉంటామని తెలిపారు. అందుకుగాను రాయ్‌దుర్గ్‌ మెట్రో నాల్గో స్టేషన్ నాల్గవ మార్గంను తెరవడంతో ప్రయాణీకుల కదలికలను సమర్థవంతంగా నిర్వహిస్తామని, మరింత మెరుగైన నిర్వహణ సామర్థ్యం మెరుగుపరుచుకోగలమని తెలిపారు.

ఇవి కూడా చదవండి…

SSC Exams:విద్యార్థులకు ఆల్‌ ది బెస్ట్

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు..

ATA:అమెరికా భారతీ ఏప్రిల్‌ 2023 సంచిక విడుదల..ఆటా

- Advertisement -