రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ మే 1వరకు అమల్లో ఉండనున్న సంగతి తెలిసిందే. రాత్రి 9 దాటితే అన్ని బంద్ చేయడంతో ఇందుకు తగ్గట్టుగానే మెట్రో సర్వీసుల దగ్గరి నుండి థియేటర్లు,హోటళ్లు అన్ని రాత్రి 9 గంటల వరకు బంద్ కానున్నాయి.
ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల సమయాల్లో మార్పులు చేసింది టీఎస్ఆర్టీసీ. హైదరాబాద్‌లో సిటీ బస్సులు తిరిగే సమయాన్ని కుదించింది. ల్లవారుజామున 4 గంటలకే మొదలయ్యే సర్వీసుల సమయాన్ని 6 గంటలకు మార్చింది. తిరిగి రాత్రి 7 గంటలకల్లా చివరి ట్రిప్పు పూర్తయ్యేలా షెడ్యూల్ రూపొందించింది.
దీంతో రాత్రి 9 వరకు బస్సులు డిపోలకు చేరనున్నాయి. మరోవైపు జిల్లా, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు యథావిధిగా నడవనున్నాయి. రాత్రి కర్ఫ్యూ మొదలవక ముందే బయలుదేరి.. కర్ఫ్యూ సమయంలో గమ్యం చేరే బస్సులు బస్టాండ్లలో ప్రయాణికులను దింపాక వారు ఇళ్లకు వెళ్లేందుకు ఆటోలు,క్యాబ్‌లు వినియోగించుకోవచ్చు. అయితే ప్రయాణ టికెట్‌ను చూపాల్సి ఉంటుంది.