సిటీలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు ఎందుకంటే..

32
- Advertisement -

శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిసి మూడు రోజులు కూడా కాకముందే మరో సిరీస్‌ కోసం భారత్‌ సన్నద్దమవుతుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రేపట్నుంచి భారత్ న్యూజిలాండ్ ల మధ్య జరిగే తొలి వన్డే మ్యాచ్ సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్‌నేషనల్‌ క్రికెట్ స్టేడియంలో భారత్ న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరుగుతుంది. ఈ సందర్భంగా నగరంలో ఉదయం 8గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్, రసూల్‌పురా, సీటీవో, ఎస్‌బీహెచ్‌ జంక్షన్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ జంక్షన్, అల్లుగడ్డ బావి, మెట్టుగూడ జంక్షన్, తార్నాక, హబ్సిగూడ, ఎన్జీఆర్‌ఐ, ఉప్పల్ ప్రాంతాల్లో నివసిస్తున్న పౌరులు పైన పేర్కొన్న మార్గంలో ప్రయాణించకుండా ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

ఇవి కూడా చదవండి…

వాళ్ళిద్దరికీ రుణపడి ఉంటా..పంత్‌ ట్వీట్‌

తారక్‌తో భారత ఆటగాళ్ల సందడి!

ఉప్పల్​లో రోహిత్ సేన..

- Advertisement -