ఐటీలో హైదరాబాద్ టాప్‌: కేటీఆర్

60
ktr speech
- Advertisement -

దేశంలోనే ఐటీ రంగంలో హైదరాబాద్‌ టాప్‌లో ఉందన్నారు మంత్రి కేటీఆర్. ఉప్పల్‌లో జెన్‌పాక్ట్ క్యాంపస్‌కి భూమి పూజ నిర్వహించిన అనంతరం మాట్లాడిన కేటీఆర్… హైదరాబాద్‌లో ఒక ప్రాంతానికి ఐటీ పరిమితము కాకూడదని మా ప్రభుత్వం వచ్చాక ఐటీ పాలసీ తీసుకు వచ్చామని ఆయన వెల్లడించారు.

ఐటీ రంగాన్ని వెస్ట్ హైదరాబాద్‌ నుంచి నగరం నలు వైపులా విస్తరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ఉండే ఐటీ ఉద్యోగులుకి మెరుగైన జీవన ప్రమాణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. వెస్ట్ హైద్రాబాద్ కి ధీటుగా ఈస్ట్ హైద్రాబాద్ కూడా ఐటీ రంగంలో ఎదుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉప్పల్‌లో త్వరలో ఐపీఎల్ మ్యాచ్ లు కూడా స్టార్ట్ అయితే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.

- Advertisement -