హైదరాబాద్‌లో రియల్ భూమ్ తగ్గడం లేదు. ఫలితంగా భాగ్యనగరంలో ఇంటి ధరలు భారీగా పెరిగాయి. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) రెసిడెక్స్ ప్రకారం 8 ప్రధాన మెట్రో నగరాల్లో చూస్తే.. ఇంటి ధరలకు రెక్కలు వచ్చాయి.
నగర శివారు చుట్టూ 20- 30 కిలోమీటర్ల వరకు ఉన్న ప్లాట్లకు, ఫ్లాట్లకు డిమాండ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా బాగా పెరిగింది. ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, ఉప్పల్, ఫరూక్‌నగర్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, గచ్చిబౌలి, ఎల్బీనగర్, వనస్థలిపురం, మేడ్చల్, రాజేంద్రనగర్, చంపాపేట, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, బంజారాహిల్, ఎల్‌బీనగర్, గండిపేట పరిధుల్లో స్థిరాస్తి లావాదేవీలు అత్యధికంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఐటీ కేంద్రంగా ఉన్న మాదాపూర్, గచ్చిబౌలి సమీప ప్రాంతాల్లో కూడా ఇళ్ల నిర్మాణాల జోరు కొనసాగుతోంది.