దేశంలో 24 గంటల్లో 46,232 కరోనా కేసులు

34
covid 19

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 46,232 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 564 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 90,50,598కి చేరాయి.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,39,747గా ఉండగా 84,78,124 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 1,32,726 మంది మృతి చెందారు.

గత 24 గంటల్లో 10,66,022 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా న‌వంబ‌ర్ 20 వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 13,06,57,808 న‌మూనాల‌ను ప‌రీక్షించామని వైద్యఆరోగ్య శాఖ తెలిపింది.