సినీ ఫక్కీలో కిడ్నాప్…చేధించిన పోలీసులు

231
hyderabad kidnap
- Advertisement -

హైదరాబాద్‌లో సినీ ఫక్కీలో జరిగిన కిడ్నాప్ కేసును చేధించారు పోలీసులు. సస్పెన్స్ థ్రిల్లర్‌లా సాగిన కిడ్నాప్ డ్రామాలో పాపను కిడ్నాపర్ల చెర్ల నుండి రక్షించారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ బోయిన్‌పల్లికి చెందిన ఆంజనేయులు- స్వరూప దంపతుల మధ్య గొడవ జరుగగా మూడేళ్ల పాపను తీసుకుని ఇంటి నుండి వచ్చేసింది స్వరూప. సికింద్రాబాద్ స్టేషన్‌ దగ్గర నిద్రిస్తున్న స్వరూపను చూసిన ఓ మహిళ మాటమాటకలిపి ఇక్కడుంటే ప్రమాదమని తన ఇంటికి తీసుకెళ్లింది.

ఉదయం ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన స్వరూపతో బస్టాండ్ వరకు వస్తానని నమ్మించిన ఆ మహిళ…పాపకు తినడానికి ఏమైనా తీసుకురావాలని స్వరూపతో చెప్పింది. స్వరూప అటువైపుగా వెళ్లగానే తన ప్లాన్ ప్రకారం పాపను తీసుకుని ఉడాయించింది.

దీంతో వెంటనే పోలీసులను స్వరూప సంప్రదించగా సీసీ ఫుటేజ్ ఆధారంగా సదరు మహిళా నిజామబాద్ వైపు వెళ్లే బస్సు ఎక్కిందని గుర్తించిన పోలీసులు…అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. బస్సు నెంబర్‌తో సహా వివరాలను అందించడంతో రామాయంపేట దగ్గర బస్సులో ఉన్న మహిళ,పాపను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. గంటల వ్యవధిలోనే పోలీసులు కిడ్నాప్ కేసు చేధించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

- Advertisement -