బ్లాక్ ఫిల్మ్‌..చైతూకు ఫైన్

38
chaitu
- Advertisement -

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం బ్లాక్ ఫిల్మ్ ఉన్న వాహనాలకు ఫైన్ వేస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుండగా తాజాగా అక్కినేని నాగచైతన్యకు జరిమానా విధించారు పోలీసులు.

జూబ్లీ హిల్స్ లో చైతూ కారుకి ఉన్న బ్లాక్ ఫిలింలను గుర్తించి ఆ కార్ ని ఆపి ట్రాఫిక్ పోలీసులు 700 రూపాయలు జరిమానా విధించారు. కార్ కి ఉన్న బ్లాక్ ఫిలింలని కూడా తొలగించారు. ఆ సమయంలో నాగ చైతన్య కార్ లోనే ఉన్నారు.

ఇప్పటికే ఎన్టీఆర్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, మంచు మనోజ్, త్రివిక్రమ్ లాంటి పలువురి కార్లను ఆపి వారి కార్లకి ఉన్న బ్లాక్ ఫిలింలని తొలగించి జరిమానాలు విధించారు పోలీసులు.

- Advertisement -