మల్టీస్టారర్ చేస్తా: యశ్

126
yash
- Advertisement -

కేజీఎఫ్-2 మూవీ ఏప్రిల్ 14న భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో థియేటర్లలో “కేజీఎఫ్-2″ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ సినిమా మరో రెండ్రోజుల్లోనే సినీ ప్రియులను థ్రిల్ చేయనుంది.

ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్రయూనిట్ ఇప్పటికే కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈవెంట్లను నిర్వహించింది. తాజాగా ఏపీలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు యశ్.

ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాము. ఇందులో ఉన్న మదర్ అండ్ సన్ ఎమోషన్ అందరికి కనెక్ట్ అవుతుంది. మా సినిమాకు తెలుగు ఆడియన్స్ ఇస్తున్న రెస్పాన్స్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటామన్నారు. అన్ని సినిమాలు రికార్డులు సృష్టించాలి. రికార్డ్స్ అనేవి ఒక భాధ్యత లాంటివి. మంచి హీరో అని కాదు ఇద్దరు హీరోలని హ్యాండిల్ చేయగలిగే డైరెక్టర్ మంచి ఆఫర్ తో వస్తే కచ్చితంగా మల్టీస్టారర్ చేస్తాను అని తెలిపారు.

- Advertisement -