- Advertisement -
హైదరాబాద్‌లోని లాలాగూడ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ (సర్కిల్ ఇన్స్పెక్టర్)గా మహిళా అధికారి మధులత నేడు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నగర పోలీసు చరిత్రలో మహిళా సీఐ ఎస్హెచ్ఓగా బాధ్యతలు చేపట్టడం ఇదే మొట్టమొదటి సారి. రాష్ట్ర హోంమంత్రి మహముద్ అలీ, పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కలిసి మధులత బాధ్యతలు అప్పగించారు. ఆమెకు అభినందనలు తెలిపారు. తనను ఎస్హెచ్ఓ గా నియమించినందుకు హోంమంత్రికి, సీపీ సీవీ ఆనంద్‌కు మధులత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 2002 బ్యాచ్‌కు చెందిన మహిళా సిఐ మధులత గతంలో సౌత్ జోన్ పాతబస్తీ ఉమెన్ పోలీస్ స్టేషన్ సిఐగా, ఎస్బి వింగ్ సిఐగా విధులు నిర్వహించారు.
- Advertisement -