హైదరాబాద్ నవాబ్ వారసత్వా కేసును పరిష్కరించాలి- సుప్రీంకోర్టు

140
Indian Supreme Court
- Advertisement -

హైదరాబాద్ నవాబు వారసత్వానికి సంబంధించిన కేసును త్వరగా తేల్చాలని రాష్ట్ర హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.1952 నుంచి.. 70 ఏళ్లుగా హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నదని సయ్యద్ జహీద్ అలీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు కేసు విచారణ త్వరితగతిన ముగించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ.బాబ్డే ఆదేశించారు.

దిగువ కోర్టులో సయ్యద్‌కు అనుకూలంగా మూడు నిర్ణయాలు వచ్చాయని.. నవాబ్ సాలార్ జంగ్ వారసుడిగా ప్రకటించారని సయ్యద్ తరపు న్యాయవాది వివరించారు.ఆస్తి అప్పగించే విషయంలో కూడా ఒక తీర్పు స్పష్టంగా ఉన్నదని, వారసుడిగా అధికార పత్రం కూడా ఇచ్చారన్నారు న్యాయవాది. ఈ విషయంలో సయ్యద్ జాహిద్ అలీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పలు లేఖలు రాసినా… ఒక్క దానికి కూడా సమాధానం రాలేదన్న న్యాయవాది వివరించారు.

దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు హైకోర్టులో సవాలు చేయడంతో.. అప్పటి నుంచి హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని వివరణ ఇచ్చారు. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా 70 ఏళ్ళు పెండింగ్‌లో ఉండటంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఐ బొబ్డే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేసును త్వరలో పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -