సర్కార్ వారి పాట..అప్‌డేట్

50
mahesh

పరుశరామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సర్కార్ వారి పాట. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి.

మహేశ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. రెగ్యులర్ షూటింగ్‌ దుబాయ్‌లో ప్రారంభంకాగా ఈ విష‌యాన్ని అధికారికంగా తెలియ‌జేస్తూ ది ఆక్ష‌న్ అండ్ ది యాక్ష‌న్ బిగిన్స్ అంటూ ఒక వీడియో విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

తాజాగా #SarkaruVaariPaata హ్యాష్ ట్యాగ్‌ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. 100 మిలియన్ల ట్వీట్స్ దాటిన మొదటి ఇండియన్ సినిమాగా ‘సర్కార్ వారి పాట’ నిలిచింది.