168 రోజుల తర్వాత మెట్రో సేవలు ప్రారంభం…

169
hmr
- Advertisement -

దాదాపు 168 రోజుల తర్వాత హైదరాబాద్‌ మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటిస్తూ ఉదయం 7 గంటలకు మెట్రో రైల్ పట్టాలెక్కింది. తొలిరోజు కారిడార్ 1లో ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్ వరకు మెట్రో సర్వీసులు నడవనుండగా నిర్దేశించిన టైమింగ్స్‌లో మాత్రమే ప్రయాణీకులకు అందుబాటులో ఉండనున్నాయి మెట్రో సర్వీసులు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు… తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు మాత్రమే మెట్రో రైళ్లు నడవనున్నాయి.

కంటైన్మెంట్ జోన్లు అయిన గాంధీ ఆస్పత్రి, భరత్‌నగర్‌, మూసాపేట, ముషీరాబాద్‌, యూసుఫ్‌గూడ స్టేషన్లలో మెట్రో రైళ్లు ఆగవు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరాన్ని పాటించడానికి మెట్రో స్టేషన్లు, మెట్రో రైలు లోపల కూడా గుర్తులను మార్క్‌ చేస్తున్నారు. ఆ మార్క్‌ ప్రాంతంలోనే ప్రయాణికులు నిల్చోవాల్సి ఉంటుంది. ఎవరైన నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు.

- Advertisement -