- Advertisement -
హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ శరవేగంగా జరగనుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందు కారిడార్లను పూర్తి చేయాలన్న లక్ష్యంతో వేగవంతంగా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
మొత్తం 162.9 కిలోమీటర్ల విస్తీర్ణంలో 8 కారిడార్ల నిర్మాణానికి రూ.43,847 కోట్ల వ్యయం అంచనా వేశారు. డీపీఆర్‌కు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టే ప్రణాళికను సిద్ధం చేశారు.
8 కారిడార్లకు వేర్వేరుగా టెండర్లు పిలవనున్నారు. ఎల్బీనగర్-హయత్‌నగర్(7.1 కి.మీ), ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట(7.5 కి.మీ), రాయదుర్గం-కోకాపేట్ నియోపోలిస్(11.6 కి.మీ) వంటి చిన్న కారిడార్లను వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో సర్కారు ఉంది.
Also Read:AP: ఇంటి ముంగిటకే కారవాన్!
- Advertisement -

