- Advertisement -
ఏపీ మంత్రి నారా లోకేశ్ ముంబైలో పర్యటించనున్నారు. ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి లోకేశ్ పర్యటన కొనసాగనుంది. అలాగే నవంబర్‌లో విశాఖ వేదికగా జరగనున్న పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొనాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు లోకేశ్.
తన పర్యటనలో భాగంగా టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, ట్రాఫిగురా సీఈఓ సచిన్ గుప్తా, ఈఎస్ఆర్ గ్రూప్ హెడ్ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ సాదత్ షా, HP Inc సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇప్సితా దాస్ గుప్తా, బ్లూ స్టార్ లిమిటెడ్ డిప్యూటీ ఛైర్మన్ వీర్ అద్వానీలను కలవనున్నారు. వీరందరిని పార్ట్‌నర్ షిప్ సమ్మిట్‌కు పిలవనున్నారు లోకేశ్.
Also Read:మిరాయ్ టీంకి దిల్ రాజు ప్రశంసలు
- Advertisement -

