సీఎంతో ఎలి లిల్లీ సంస్థ ప్రతినిధుల భేటీ

10
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు ఎలి లిల్లీ సంస్థ ప్రతినిధులు. హైదరాబాద్‌లో రూ.9 వేల కోట్లతో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, క్వాలిటీ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది ఎలి లిల్లీ సంస్థ.

పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చేవారికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తుందని తెలిపారు సీఎం రేవంత్. ఈ మేరకు ఎలి లిల్లీ సంస్థను అభినందించారు సీఎం రేవంత్.

ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు,ఎలి లిల్లీ సంస్థ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్, ఎలి లిల్లీ ఇండియా ప్రెసిడెంట్ విన్సెలో టుకర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి తదితరలు హాజరయ్యారు.

Also Read:మిరాయ్ టీంకి దిల్ రాజు ప్రశంసలు

- Advertisement -