- Advertisement -
హైదరాబాద్ మెట్రో రైలు ప్రమాదం నుంచి బయటపడిందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. వాస్తవాలు తెలియకుండా ఈ రకమైన పుకార్లను వ్యాప్తి చేయవద్దని విజ్నప్తి చేశారు. అసెంబ్లీ స్టేషన్ కు సమీపంలో వీచిన గాలి ధాటికి పిడుగులను ఆకర్షించే రాడ్ ట్రాక్ పై పడిందని అన్నారు. దీంతో, విద్యుత్ సరఫరాను నిలిపి వేశామని స్పష్టం చేశారు.
వెంటనే ఆ రాడ్ ను తొలగించామని స్పష్టం చేశారు. బ్యాటరీ సాయంతో మెట్రో రైలు అసెంబ్లీ స్టేషన్ సమీపానికి వచ్చి ఆగిందని అయితే, ఈ రైల్లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు ఆస్తమా వ్యాధితో ఇబ్బంది పడుతుండటంతో తమ సిబ్బందికి ఫిర్యాదు చేశారని చెప్పారు. తక్షణమే ప్రయాణికులను ఖాళీ చేసి రైలును అసెంబ్లీ స్టేషన్ కు తీసుకెళ్లామని స్పష్టం చేశారు.
- Advertisement -