ముస్లిం మహిళ పట్ల శాపంగా మారిన ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతనం ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే.. ట్రిపుల్ తలాక్ చెప్పే భర్తకు మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది.అయినప్పటికీ వాటిని కూడా లెక్కడేయకుండా విచిత్ర కారణాలను తెలుపుతూ కొందదు తమ భార్యలకు ట్రిపుల్ తలాక్ చెబుతున్నారు.
తన భార్యకు దంతాలు సరిగా లేవంటూ ఓ ప్రబుద్దుడు ట్రిపుల్ తలాక్ చెప్పి వెళ్లిపోయాడు. దంతాలు సరిగా లేవని విడాకులు ఇవ్వడమేంటని అనుకుంటున్నారా? ఆశ్చర్యపోకండి.. ఇది నిజమే! హైదరాబాద్‌కు చెందిన రుక్సానా బేగంకు దంతాలు సరిగా లేవు. ఆమె దంతాలు వెనుక ముందుకు ఉన్నాయి. దీంతో ఆమెను భర్త గత కొన్ని నెలల నుంచి వేధించడం మొదలుపెట్టాడు.
దంతాలు సరిగా లేవని.. రుక్సానాకు ఇటీవలే ఆమె భర్త త్రిపుల్ తలాక్ చెప్పేసి వెళ్లిపోయాడు. తాను తన భర్త వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. తమ మధ్య ఎలాంటి బంధం లేదని చెబుతున్నాడని ఆమె వాపోయింది. తనకు న్యాయం కావాలని రుక్సానా బేగం డిమాండ్ చేస్తుంది.