- Advertisement -
తెలుగు సినీ ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారన్నారు ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు. మీడియాతో మాట్లాడిన దిల్ రాజు.. సినీ ఇండస్ట్రీని ప్రపంచంలోనే నంబర్ వన్ గా చేయడం కోసం ప్రభుత్వంతో కలిసి పని చేస్తాం అన్నారు.
హాలీవుడ్ వాళ్ళు వచ్చి మన హైదరాబాద్ లో షూటింగ్ చేసేలా సూచనలు ఇవ్వాలని సీఎం అడిగారని…ప్రభుత్వంతో కలిసి మన హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ సినీ ఇండస్ట్రీ హబ్ గా మారుస్తాం అన్నారు.
అల్లు అర్జున్ ఘటనపై సీఎం రేవంత్ ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేదు అన్నారు మురళీమోహన్. సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని సీఎం అన్నారు అన్నారు. బెనిఫిట్ షోలు, అవార్డుల గురించి సమావేశంలో మాట్లాడడం జరిగిందని తెలిపారు.
Also Read:ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉంది: నిర్మాతలు
- Advertisement -