క్రీడా హబ్ గా హైదరాబాద్ః మంత్రి శ్రీనివాస్ గౌడ్

547
Srinivas Goud
- Advertisement -

హైదరాబాద్ నగరం క్రీడా హబ్ గా రూపొందుతుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని జింఖాన క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న తెలంగాణ స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 6 వ సీనియర్ పురుషుల మరియు మహిళల పోటీలను రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శ్రీ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ సాయిలు, కార్యవర్గ సభ్యులు, DYSO సుధాకర్ లు పాల్గొన్నారు.

srinivas Goud

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రోత్సహాం అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాల కోసం 2 శాతం, ఉన్నత విద్య కోసం 0.5 శాతం క్రీడా రిజర్వేషన్లు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో క్రీడా మౌళిక వసతుల కల్పన కు కృషిచేస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరం క్రీడా హబ్ గా రూపొందుతుందన్నారు. 2020 – టోక్యో లో జరిగే ఒలింపిక్స్ లో తెలంగాణ క్రీడాకారులు మంచి ప్రతిభను కనబరచి దేశానికి , రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ వెయిట్ లిఫ్టింగ్ పోటీలను నేటి నుండి ఈ నెల 25 వరకు జరుగుతాయన్నారు. ఎక్కడ ప్రతిభ సాధించిన వెయిట్ లిఫ్టర్లు నేషనల్ కి ఎంపిక అవుతారని మంత్రి వెల్లడించారు.

srinivas Goud

- Advertisement -