తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

470
Municipa elections
- Advertisement -

తెలంగాణ లో మరోసారి ఎన్నికల నగారా మోగింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్‌. మున్నిపల్‌ ఎన్నికల నిర్వహణకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. జనవరి 7న పురపాలక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

ఈనెల 30న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. డిసెంబర్‌ 31 నుంచి జనవరి 2 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. డిసెంబర్‌ 31వ తేదీన జిల్లా అధికారులతో రాజకీయ పార్టీల సమావేశం  నిర్వహించనున్నారు. జనవరి 1న మున్సిపల్‌ కమిషనర్లతో ఈసీ భేటీ అవుతుంది. జనవరి 3న అభ్యంతరాలకు పరిష్కారం, వివరణ ఇస్తారు. జనవరి 4న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తారు.

జనవరి 10న నామినేషన్లకు చివరి తేదీ
జనవరి 11న నామినేషన్ల పరిశీలన
జనవరి 14న ఉపసంహరణకు తుది గడువు
జనవరి 22న పోలింగ్‌
జనవరి 25న ఓట్ల లెక్కింపు

muni

- Advertisement -