దిగొచ్చిన బంగారం ధర!..

146
Gold Rate Today Live

పసిడి ధర మళ్లీ తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.550 తగ్గి రూ.53,720కు చేరగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.510 తగ్గి 10 గ్రాముల బంగారం ధర రూ.49,240కు చేరింది.

బంగారం ధర తగ్గితే వెండి ధర పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర రూ.800 పెరిగి రూ.66,300కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా దేశీయ మార్కెట్‌లో పసిడి దిగిరావడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఔన్స్‌కు 2.09 శాతం పెరిగి 1973 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 2.11 శాతం పెరుగుదలతో 27.59 డాలర్లకు చేరింది.