మొక్కలు నాటిన బిగ్ బాస్ షో ఫేమ్ తేజస్వీ మదివాడ

160
green challenge

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్పూర్తిగా తీసుకొని నేడు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటారు బిగ్ బాస్ షో ఫేమ్ తేజస్వీ మదివాడ.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని రక్షించాలని కోరారు.ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. టిడిపి పార్టీ నాయకురాలు గ్రీష్మ కావళి ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.