పసిడి ప్రేమికుల శుభవార్త…

186
Gold Rate Today Live
- Advertisement -

పసిడి ప్రేమికులకు నిజంగా ఇది శుభవార్తే. కొంతకాలంగా పెరుగుతున్న బంగారం ధరలకు క్రమంగా బ్రేక్ పడుతూ వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగిన దేశీయ మార్కెట్‌లో మాత్రం తగ్గుముఖం పట్టింది.

హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.390 తగ్గి.. రూ.48,770కు చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.430 క్షీణించి.. రూ.53,200కు చేరింది.

బంగారం బాటలోనే వెండి కూడా తగ్గుముఖం పట్టింది. కేజీ వెండిపై 1600 తగ్గి రూ.65,600కు చేరింది. పసిడి ధర ఔన్స్‌కు 0.20 శాతం పెరుగుదలతో 1941 డాలర్లకు పెరగగా.. వెండి ధర ఔన్స్‌కు 0.39 శాతం పెరుగుదలతో 26.90 డాలర్లుగా ఉంది.

- Advertisement -